చల్లని మజ్జిగ, మంచినీరు భక్తులకు ఉచిత సరఫరా
మన పొనుగుపాడు గ్రామంలో ది.08.05.2017న శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి, శ్రీ వినుకొండ అంకమ్మతల్లి మొదలగు దేవాలయంలు జీర్ణోద్దరణ గావించబడి సాలగ్రాముల, జీవధ్వజ స్తంబంల ప్రతిష్ట అంత్యంత వైభవంగా జరిగిన సంగతి మనందరుకు తెలుసు.
ఈ ఎండాకాలం, మిట్టమధ్యాహ్నం గ్రామ ప్రజలు, దూర ప్రాంతాల భక్తులు శ్రమతో విచ్చేసి, మహోత్సవం లో ఎటువంటి ఇబ్బందుల పడకుండా పాల్గొన్నారు.
మనం ఈ కాలంలో ఇంట్లో ఉంటే సాయంత్రం ఐదు గంటల వరకు ఎవ్వరూ బయటకు వెళ్లే పరిస్థితి కాదు.
అలాంటి ఈ సమయంలో మహోత్సవంకు విచ్చేసిన భక్తులు ఎటువంటి వడదెబ్బకు గురి కాకుండా ఉన్నారంటే, దాని వెనుక శ్రీవేణుగోపాల్ ఎడ్యుకేషనల్ సొసైటి వారి కృషి ఎంతో ఉంది.వారి కృషి ఆమోఘం.
కార్యక్రమం చిత్రమాలిక
[smartslider3 slider=31]ప్రధాన వీధిలో అన్ని దేవాలయాలకు వచ్చే భక్తులకు సమీప అందుబాటులో ఉదయం గం.9.00.ల నుండి సాయంత్రం గం.06.00.ల వరకు ఉచిత చల్లని మజ్జిగ, చల్లని మినరల్ వాటర్ భక్తులకు అంద చేయుటవలనే ఎవ్వరూ ఇబ్బంది పడలేదు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ఎవరైనా సిగ్గుపడి రాని వారిని మరీ పిలిచి ఇచ్చుట విశేషం.పెద్ద వారిని కూర్చోబెట్టి ఆదరించి వారి దాహార్తి తీర్చారు.
శ్రీవేణుగోపాల్ ఎడ్యుకేషనల్ సొసైటి వ్యవస్థాపకుడు తూము వేణుగోపాల్, (హైకోర్టు అడ్వకేటు) స్వగ్రామంనకు చేసిన సేవ మరువరానిది. వీరి తల్లిదండ్రులు హరిబాబు, పుష్పావతి అభినందనీయులు.
ఈ కార్యక్రమాలకు ముందుండే కోయ రామారావు ఆధ్వర్యం వహించారు. వంకాయలపాటి కోట్లింగయ్య పర్వేక్షణలో వలి మాష్టరు, వక్కంటి వెంకటేశ్వరరావు, జె.రామారావు, పొన్నం అమర్ సాయి,రాయిడి వెంకయ్య, బాలకృష్ణ, కృష్ణవేణి, సొమయ్య, రజని, కె.సుబ్బారావు, కాంతారావు తదితరులు పాల్గొని వారి సేవలు అందించారు.
ఈ సందర్బంగా వార్కి www.manaponugupadu.com తరుపున అభినందనలు