సంక్రాంతి శుభాకాంక్షలు

గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన మన అందరికి ఎక్కడ ఉన్నా సంక్రాంతి  పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మన గ్రామం, మనం పెరిగిన వాతావరణం,పాడి పంటలు.

మకర సంక్రాంతి లేదా సంక్రమణం.. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం..దీనినే సంక్రాంతి అంటారు.

స్వగ్రామం నుండి జీవన ప్రయాణంలో  ఎవరి ఎక్కడకు వెళ్లినా ఇతరత్రా పండగలకు వెళ్లినా,వెళ్లకపోయినా సంక్రాంతి పండగకు అందరూ సొంతూరుకు తప్పనిసరిగా వెళతాం.

పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగ అని చెప్పకుంటాం.

సంక్రాంతి పండుగ మూడు రోజుల పండగ. ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటాం. ఆరోజు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటాం.

మనలోని పాత ఆలోచనలుకు స్వస్తి చెప్పి, కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్ని దేవుడిని వేడుకుంటాం.  అందుకు గుర్తుగా ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని చలిమంటల ద్వారా ఆహుతి చేస్తాం.

ఇండ్ల ఎదురు రంగు రంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరిస్తాం. చిన్నారులకు భోగి పండ్లు పోస్తాం.ఈ పండగకు అరిసెలు ముఖ్వమైన పిండివంటగా భావించి ప్రతి ఇంటిలో చేసుకుంటాం.

రెండో రోజు సంక్రాంతి…

ఈ రోజు కూడా  రంగు రంగులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తాం. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటిచుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతుంటాం.

పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తుంటాం.

గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలను అనుగుణంగా వాటిచేత నృత్యాలు చేయిస్తుంటారు. 

అంతేగాక హరిలో రంగ హరీ..అంటూ  బోడి తలపై రాగి అక్షయపాత్ర పెట్టుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు.

మూడో రోజు కనుమ..

సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తుంటారు.

పశువులను అలకరిస్తాం.

బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. 

 

Check Also

ఆంధ్రప్రదేశ్ 2024 శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రకటించిన అభ్యర్థుల రెండవ జాబితా

అభ్యర్థుల రెండవ జాబితా తెలుగుదేశం పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2024లో జరగబోవు ఎన్నికలకు నిలబెట్టే అభ్యర్థులు రెండోజాబితాను ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *