పొనుగుపాడు విద్యా కుసుమం.
సాయిపూజ తండ్రి (లేటు) వేమూరి శ్రీనివాసరావు. తల్లి అనంతలక్ష్మి. వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. సాయిపూజ ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు మేనమామ ఇంట్లో ఉంటూ, నాట్కో పాఠశాల , హైదరాబాదులో చదివింది.
ఆరవ తరగతి, ఏడువ తరగతి సిద్థార్థ రెసిడెన్సియల్ పాఠశాల నరసరావుపేటలో చదివింది. ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు నరసరావుపేట లోని వాసవి కాన్సెప్ట్ పాఠశాలలో చదివింది. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ విజయవాడ నారాయణ కళాశాలలో చదివింది. 2014 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 973/1000. (బై.పి.సి ) మార్కులు సాధించింది.
2014 ఎంసెట్ లో 722 ర్యాంకుతో గుంటూరు మెడికల్ కాలేజిలో యం.బి.బి.యస్. సీటు పొంది 08.08.2014 న వైద్యకోర్సు లో చేరింది. ఈసందర్బంగా సాయిపూజకు శుభాకాంక్షలు.