రామారావు జననం – వారి పూర్వీకులు.
పొనుగుపాడు గ్రామంలో 25.11.1955 న జన్మించారు.
వీరిది వ్యవసాయ కుటుంబం.తండ్రి వెంకటేశ్వర్లు,తల్లి నాయకమ్మ.ఈ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు.తాత కోట్లింగం, నాయనమ్మ కోటమ్మ. ముత్తాత పున్నయ్య, ముది నాయనమ్మ, వరమ్మ .
కృష్ణా జిల్లా, గూడూరు మండలం, చిట్టిగూడూరు గ్రామానికి చెందిన వేమూరి వెంకటకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతుల ప్రథమ కుమార్తె రాణిని 26.05.1978 న వివాహమాడారు. రామారావు తోబుట్టువులు సీతారామమ్మ, వరలక్ష్మి, పుష్పావతి.
మొదటి తోబుట్టువు సీతారామమ్మ వివాహం పొనుగుపాడు గ్రామానికే చెందిన రాయుడి వెంకయ్యతో జరిగింది. ఈ దంపతుల సంతానం ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, శివకుమారి. కుమార్డు బాలకృష్ణ. ద్వితీయ సోదరి వరలక్ష్మి వివాహం నాదెండ్ల మండలం, గొరిజవోలు గ్రామానికి చెందిన దివ్వ సోమయ్య (మేనమామ) తో జరిగింది. ఈ దంపతుల సంతానం ముగ్గురు కుమార్తెలు. భారతి, రజని, జ్యోతి.
అలాగే తృతీయ సోదరి పుష్పావతి వివాహం స్వగ్రామనికి చెందిన తూము తిరపతయ్య కుమార్డు హరిబాబుతో జరిగింది. ఈ దంపతుల సంతానం కుమార్డు వేణుగోపాల్. కుమార్తె కల్పన. వేణుగోపాల్ హైకోర్టు అడ్వకేటుగా పని చేయుచున్నారు.
ఇక రామారావు తల్లిదండ్రులను గురించి చెప్పాలంటే ప్రయాణ సదుపాయాలు లేని ఆ రోజుల్లో గ్రామంలోని ఉత్తరపు బజారు, పడమర బజారు గ్రామస్తులు వేరే ఏ గ్రామం వెళ్లాలన్నా దక్షణం బజారులో ఉన్న వీరి ఇంటి ముందుగా నడచి వెళ్లాలి.తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పని సరిగా వచ్చే పోయే వారిని వారు వీరు అని కాకుండా కుశల ప్రశ్నలుతో నవ్వుతూ పలకరించకుండా వెళ్లనివ్వరు. అది వారి మంచితనానికి నిదర్శనం.ఈ కాలంలో అటువంటి పలకరింపులు మచ్చుకు కూడా కానరావటంలేదు.
రామారావు విద్యాభ్యాసం .
స్వగ్రామంలోని హిందూ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. (1962-1967). ఆ తదుపరి పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చదివారు. (1967-1972).నరసరావుపేట యస్.యస్. యన్.కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. (1972-74). యస్.కె.ఆర్.బి.ఆర్. కళాశాలలో బి.కాం. పూర్తి చేసి పట్టా పొందారు.రామారావు పక్కా వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అందువలన ఆయనకు వ్యవసాయంపై ఆసక్తి మెండు.
ఆ ఆసక్తితోనే చిన్నతనం నుండి చదువుకుంటూనే తండ్రికి చేదోడు వాదోడుగా వ్యవసాయ పనులలో పాల్గొనేవాడు. ఇప్పటికి నరసరావుపేట నుండి పొనుగుపాడు సందర్శించిన సమయంలో పొలంలో జరుగుచున్న వ్యవసాయ పనులును స్యయంగా వెళ్లి అసక్తిగా తెలుసుకుంటుంటారు.
గ్రామంలో ఉన్న కోయ వారి కుటుంబాలలో ఉన్నత చదువు చదివి ఉన్నతోద్యోగం చేసిన మొదటి వ్యక్తి అని చెప్పకోవచ్చు.
రామారావు ఉద్యోగ ప్రస్ధానం.
మొదటగా స్టేట్ ఫైనాన్షియల్ కార్పోరేషన్, విశాఖపట్నంలో క్లర్క్ కమ్ క్యాషియర్ గా చేరారు. అక్కడ కొంతకాలం మాత్రమే పని చేసారు.అనంతరం ఆంధ్రా బ్యాంకు, బొబ్బిలి బ్రాంచిలో క్లర్క్ కమ్ క్యాషియర్ గా 31.08.1979న రంగప్రవేశం చేసారు. అక్కడ కొంతకాలం పని చేసారు.
దరిమిలా గుంటూరు జిల్లా రెంటచింతల, నరసరావుపేట, రామిరెడ్డిపేట, ఫిరంగిపురం బ్రాంచిల నందు క్లర్క్ కమ్ క్యాషియర్ గా 2001 వరకు పనిచేసారు.ఆ తదుపరి అసిస్టెంట్ మేనేజరుగా పదోన్నతి పొంది రాయపూర్ (కలకత్తా జోన్) బ్రాంచికి బదిలీ అయ్యారు. అక్కడ 2004 వరకు పనిచేసారు.
తదుపరి మరలా అదే హోదాలో గుంటూరు జిల్లాలోని ఈపూరు, నరసరావుపేట, మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని అరవల్లి, అత్తిలి బ్రాంచిలలో 2012 వరకు పని చేసారు.
బ్రాంచి మేనేజరు పదోన్నతి పొంది నరసరావుపేట లోని రామిరెడ్డిపేట బ్రాంచి నందు విధులులో చేరారు.ఇక రామారావు పనిచేసిన ఆంధ్రా బ్యాంకును గురించి చెప్పాలంటే భారతదేశపు వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు ఒకటి.
ఆంధ్రా బ్యాంకు స్థాపన
ఈ బ్యాంకును 1923, నవంబరు 20 న ప్రముఖ స్వాతంత్ర సమర యోధుదు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్య చేతులుమీదుగా మొట్టమొదట మచిలీపట్నంలో రిజిష్టరు చేయించి స్థాపించారు.
బ్యాంకు వ్యాపార లావాదేవీలుతో అధికారికంగా 28.11.1923 నుండి ప్రారంభించబడింది. 1980లో ఈ బ్యాంకు జాతీయం చేయబడింది.డాక్టరు బోగరాజు పట్టాబి సీతారామయ్య జన్మదిన సందర్బంగా డిసెంబరు 24 న ప్రతి సంవత్సరం బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం జరుగుతుంది.డాక్టరు బోగరాజు పట్టాబి సీతారామయ్య పూర్వపు కృిష్ణా జిల్లా గుండుగొలను గ్రామం (ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా, బీమడోలు మండలం) లో 24.12.1880న జన్మించారు.
ఆంద్రా బ్యాంకు ఇప్పటికి తొంబై రెండు వసంతాలు పూర్తి చేసుకుంది. అలాంటి బ్యాంకు రంగంలో రామారావు వివిద హోదాలలో ముప్పై ఆరు సంవత్సరంలు పైబడి సేవలు అందించారు.
వీరు సర్వీసులో ఉత్తమ సేవలు అందించి నందుకుగాను 2013 లో అప్పటి చైర్మెన్ మరియు మేనేజింగు డైరెక్టరు B.A. ప్రభాకర్ నుండి అవార్డు అందుకున్నారు.2014 లో అప్పటి చైర్మెన్ మరియు మేనేజింగు డైరెక్టరు C.V.R.రాజేంధ్రన్ గారి నుండి తిరిగి అవార్డు అందుకున్నారు. చివరగా రామిరెడ్డిపేట (నరసరావుపేట) ఆంద్రా బ్యాంకు బ్రాంచి మేనేజరు హోదాలో 30.11.2015న పదవీ విరమణ పొందారు.
పదవీ విరమణ ఫొటోలు లింకు Click Here
ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధుల సంఘం అధ్యక్షులు
రామారావు ఎక్కడ ఉన్నా స్వగ్రామం పొనుగుపాడును గుర్తుంచు కుంటారు.
గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమాలలో తన పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. గ్రామస్తులు ప్రమేయం లేకుండా వార్షికోత్సవాలు 1992 వరకు బహు సాధారణంగా జరిగేవి.ఆ స్కూలులోనే శ్రీకట్టా కృష్ణమూర్తి మ్యాథ్స్ టీచరుగా పని చేసారు.
ఆయన ఆలోచనలతో పూర్వ విద్యార్థులైన డాక్టరు మర్రి పెద్దయ్య, కీ.శే. యామాని వెంకట్రావు నేతృత్వంలో రామారావు, మరి కొంతమంది సహకారంతో 1993లో పూర్వ విద్యార్థుల సంఘం స్థాపించారు.అప్పటి నుండి ఆ సంఘంనకు రామారావు అధ్యక్షునిగా పనిచేయుచున్నారు. డాక్టరు మర్రి పెద్దయ్య, యం.డి. గౌరవ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.
తొమ్మిదవ తరగతి మెరిట్ విద్యార్థికి ప్రతి సంవత్సరం రామారావు తన స్వంతంగా స్కాలరుషిప్ అందచేస్తున్నారు. పూర్వ విద్యార్థుల నుండి మాత్రమే విరాళాలు సేకరించి, వార్షికోత్సవం సందర్బంగా పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా పేద విద్యార్థులకు ధన సహాయం అందిస్తారు.మొదటలో కొద్ది మొత్తంతో ప్రారంభించినప్పటికీ, నేడు యాబై వేల రుపాయల పైబడి సొమ్మును విద్యార్థులకు అందించుటలో రామారావు కృషి ఏంతో ఉంది.
రామారావు సేవా కార్యక్రమాలు.
రామారావు నిర్వహించే ప్రతి కార్యక్రమం జయప్రదం కానటానికి తన మిత్రులు వంకాయలపాటి కోట్లింగయ్య, వలి మాష్టరు, గుంటుపల్లి వెంకటేశ్వరరావు, ఈదర హరిబాబు, కొంగర రాఘవయ్య, క్రోసూరి బాలరాజు, వక్కంటి వెంకటేశ్వరరావు. శివయ్య మాష్టరు, గ్రామస్థుల సహకారం ఎంతో ఉంది.
పూర్వ విద్యార్థుల సంఘం నేత్రత్వంలో స్వచ్చంధ సేవా సహకార సంస్ధల ద్వారా ఫాఠశాలకు పొనుగుపాడు గ్రామానికి చెందిన గుంటుపల్లి తులసీధరరావు, సోదరులు కృష్ణ, చంద్రమౌళి, ప్రసాదుల (గౌరిశంకర్ ట్రేడింగు కంపెని, మిర్చి కమీషన్ ఏజెంట్సు, గుంటూరు వారి సహకారం) తో రోటరీ క్లబ్ ద్వారా నలభై బెంచీలు సమకూర్చారు.
అంతేగాదు అ స్కూలులో చదివి నేడు ఉన్నత స్థానంలో ఉన్నవారిని గుర్తించి సన్మానించుటలో రామారావు పాత్ర ఎంతో ఉంది. ఆ రోజున రామారావు తన తండ్రి కీ. శే. వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం అతిథులకు భోజన వసతి కల్పిస్తారు.
ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయులను రామారావు తన నేత్రత్వంలో సన్మానిస్తారు. ఇంకా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం సందర్బంగా నవంబరు 14న పాఠశాలలోని విద్యార్థులకు డాక్టరు మర్రి పెద్దయ్య, యం.డి. సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లు రామారావు స్వయంగా కల్పిస్తారు.
రామారావు ఆధ్వర్యంలో జిల్లాపరిషత్ పాఠశాల నందు లీడ్ ఇండియా, మరియు స్వచ్చభారత్ కార్యక్రమాలు నిర్వహించబడినవి
రామారావు రాణి దంపతుల సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్డు అజయ్ కుమార్ యం.టెక్ చదివారు. కుమార్తె శిరీష యం.యస్సీ. చదివింది.
కుమార్డు అజయ్ కుమార్ గుంటూరు జిల్లా, తెనాలి మండలం, మోపర్రు గ్రామానికి చెందిన పల్లెంపాటి శివకుమార్ (ఆంధ్రా బ్యాంకు), దుర్గాభవాని దంపతుల కుమార్తె శ్రావణి యం.యస్సీ. తో 09.05.2007న వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు సీనియర్ సాప్టువేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేయుచున్నారు.ఈ దంపతుల సంతానం ఒక కుమార్డు రుత్విక్ సాయి, ఒక కుమార్తె తన్వి సాయి.
కుమార్తె శిరీష గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలం, నాగభైరువారిపాలెం గ్రామానికి చెందిన పోట్ల నాగేశ్వరరావు, నగరాజకుమారి దంపతుల పెద్ద కుమారుడు కిషోర్ బాబు, యం.యస్సీ. తో 16.03.2006న జరిగింది.అల్లుడు కిషోర్ బాబు సీనియర్ సాప్టువేర్ ఇంజనీరుగా అమెరికాలో ఉద్యోగం చేయుచున్నారు. ఈ దంపతుల సంతానం ఇద్దరు కుమార్తెలు సహస్ర, కృష్ణనయన.
రామారావు ముందుచూపుతో స్వగ్రామం పొనుగుపాడుకు దగ్గరలో ఉండి, గ్రామంలో జరిగే సేవాకార్యక్రమాలలో పాల్గొనాలనే ఆశయంతో నరసరావుపేటలోని కాకతీయనగర్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు.