అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
మొదటగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన బంగ్లాదేశీయుల చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏట ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బంగ్లాదేశ్ చొరవతో ఇది ఆవిర్బవించింది. ఇది 1999 యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్‌లో ఆమోదించబడింది. 1999 ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. యునెస్కో స్థిరమైన సమాజాల కోసం సాంస్కృతిక, భాషా వైవిధ్య ప్రాముఖ్యతను పెంపుదించుటలో భాగంగా ఇది దోహదపడిందని గట్టిగా విశ్వసిస్తుంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఇతరుల పట్ల సహనం, గౌరవాన్ని పెంపొందించే సంస్కృతులు, భాషలలోని వ్యత్యాసాలను సంరక్షించడానికి, శాంతి కోసం అని యునెస్కో దాని ఆదేశంలో పలికింది. బహుభాషా , బహుళసాంస్కృతిక సమాజాలు వారి భాషల ద్వారా ఉనికిలో ఉన్నాయి. ఇవి సాంప్రదాయ జ్ఞానం, సంస్కృతులను స్థిరమైన మార్గంలో జ్ఞానోదయం చేస్తాయి, వాటిని సంరక్షిస్తాయి.