జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొనుగుపాడు.

పాఠశాల పూర్వాపరాలు.

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 90

ఉన్నత పాఠశాల నిర్మించిన సర్వే నెం, 512-1. య.2-17 సెంట్లు, 513-1. య.2.83 సెంట్లు. మొత్తం విస్తీర్ణం: య.5-00.లు.

పాఠశాల నిర్మాణంనకు ఉచితంగా స్తలం ఇచ్చిన దాతలు: శ్రీయుతులు 1. రాయంకుల వెంకయ్య 2. మర్రి విశ్వేశ్వరరావు, గోపాలకృష్ణయ్య, 3. యామాని కోటయ్య, 4. కట్టా ఆదినారాయణ, రామకోటయ్య, వెంకయ్య, 5. గరికపాటి రామస్వామి, విశ్వనాధం, 6. శ్రీమతి కాకర్ల అచ్చమ్మ.

మంజూరు ఉత్తర్వులు సంఖ్య: అర్.ఒ.సి.2030-జి2-1951, తేది.29.06.1951./ డి.పి.ఐ./ ఉమ్మడి మద్రాసు రాష్టం.

ప్రారంభించిన తేది: 06.07.1951. మొదట ప్రారంభించిన బిల్డింగు: శివాలయంనకు చెందిన సత్రం  (రాయంకుల తాతయ్య పంతులు గారి బడిలో)

మొదటి ప్రధానోపాధ్యాయులు: శ్రీ వై.కిష్ణమూర్తి. మొదట పనిచేసిన మీనియల్ సిబ్బంది. 1. శ్రీ సుంకుల నారాయణ (అటెండర్) 2.శ్రీ జొన్నలగడ్డ రామస్వామి. (నైట్ వాచ్ మన్).

computer-lab-opening-in-zph-school-3ఉన్నత పాఠశాల కంప్యూటరు ల్యాబ్ నిర్మాణం.  “కొరిటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రష్టు” విరాళం 3.5 లక్షలతో జన్మభూమి పథకం క్రింద నిర్మించబడింది.

కంప్యూటరు ల్యాబ్ ను 19.05.2002 న  అప్పటి రాజ్యసభ సభ్యులు శ్రీ యడ్లపాటి వెంకట్రావు ప్రారంబోత్సవం చేసారు.

కార్యక్రమానికి అప్పటి సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ యలమంచిలి వీరాంజనేయులు అధ్యక్షత వహించారు.

కార్యక్రమానికి అప్పటి గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వెంపరాల వెంకటేశ్వరరావు,  జిల్లాపరిషత్ చైర్మెన్ శ్రీ పాతూరి నాగభూషణం,  గ్రామ పంచాయితి సర్పంచ్ శ్రీమతి  షేక్ మహబూబా, తదితరులు గౌరవ అతిధులుగా హాజరైయ్యారు.

ల్యాబ్ నిర్మాణం ప్రముఖ పారిశ్రామికవేత్త  శ్రీ వంకాయలపాటి బలరామకృష్ణయ్య పర్వేక్షణలో  శ్రీ వంకాయలపాటి సుధాకరరావు, శ్రీ రాయుడి చంద్రశేఖరరావు, అప్పటి గ్రామ పంచాయితి వైస్ ప్రెసిడెంట్ శ్రీ కర్లపూడి రాఘవరావుల పర్వేక్షణలో నిర్మించబడింది.

 • ల్యాబ్ లో ప్రభుత్వం పదకొండు కంప్యూటర్లును సమకూర్చింది.
 • ప్రస్తుతం పాఠశాలలో చదువుచున్న విద్యార్థుల సంఖ్య బాలురు:104, బాలికలు:106. మొత్తం 210
 • ఉన్నత పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు  శ్రీమతి యస్.పి.కె.ప్రసాదిని, యం.ఎ. (హిస్టరీ), బి.ఇ.డి., 15.07.2009 నుండి పనిచేస్తున్నారు.
 • గత మూడు సంవత్సరాల నుండి మిత్రా ఫౌండేషన్ వారు ఉచితంగా త్రాగు నీరు అందిస్తున్నారు.

పూర్వ విద్యార్థుల సంఘం కార్యనిర్వాహకవర్గం.

 • ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పడిన సంవత్సరం. 1993
 • గౌరవ అద్యక్షులుగా  డాక్టరు మర్రి పెద్దయ్య, అద్యక్షులుగా శ్రీ కోయ రామారావు, కార్యదర్శిగా శ్రీ షేక్ మస్తానువలి. కోశాధికారిగా శ్రీ వంకాయలపాటి కోట్లింగయ్య వ్యవహరించుచున్నారు.
 • ఇతర కార్యవర్గ సభ్యులు: శ్రీ ఈదర హరిబాబు, శ్రీ క్రోసూరి బాలరాజు, శ్రీ కొంగర జగన్నాధం, శ్రీ పాతూరి సూర్యనారాయణ.
 • ముఖ్య సలహాదారు శ్రీ గుంటుపల్లి జగన్నాధం. (బెష్ట్ సి.ఇ.ఒ. అవార్డు గ్రహీత -2010. సౌత్ ఈస్టర్న్ యూరోప్ కంట్రీసు).

2013-2014 విద్యాసంవత్సరం పదవ తరగతి పాఠశాల ప్రథమ విద్యార్థులు.

 • ఇంగ్లీసు మీడియం లో  9.3 గ్రేడుతో కోయ భార్గవ స్కూలు ప్రథమ స్థానం సాధించాడు. తండ్రి శివరామకృష్ణ, తల్లి పద్మ. పొనుగుపాడు.
 • అలాగే తెలుగు మీడియంలో  9.3 గ్రేడుతో మైనీడి ప్రియాంక ప్రథమ స్థానం సాధించింది. తండ్రి హనుమంతురావు, తల్లి  శ్రీదేవి. పొనుగుపాడు.
 • ఉన్నత పాఠశాల 2013-14 విద్యాసంవత్సరం పదవ తరగతి పరిక్షా ఫలితాలలో ఇంగ్లీసు మీడియం 100 % ఉత్తీర్ణత,  తెలుగు మీడియంలో 87 % ఉత్తీర్ణత సాధించింది.

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *