వంకాయలపాటి శివరామకృష్ణయ్య-సంతాపసభ

మన పొనుగుపాడు గ్రామపంచాయితీ మాజీ సర్పంచ్,  వంకాయలపాటి శివరామకృష్ట్మయ్య  2024 జనవరి 20 శనివారం ఉదయం మనందరిని శోకసముద్రంలో ముంచి స్వర్గస్థులైన సంగతి అందరికీ తెలుసు.

వారిని గురించి ఎంత చెప్పినా తక్కువే.. 1936 సెప్టెంబరు 11న పొనుగుపాడు గ్రామంలో జన్మించారు. 1955 -1958 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., (ఆనర్స్) చేసారు. 1964 నుండి 1981 వరకు ఏకకాలంలో 17 సంవత్సరాలు గ్రామ పంచాయితీ సర్పంచ్ గా చేసిన ఘనత శివరామకృష్ణయ్య గారిది. ఇంకా చెప్పాలంటే మృదు స్వభావి, రైతు ఉద్యమనాయకుడు, గ్రామ ప్రజలకు తలమానికం లాంటి వ్యక్తి, నిత్య కృషీవలుడు, ఎంతోమందికి దారిచూపిన మహోన్నత వ్యక్తి. చిన్నవారిని పెద్ద వారిని ఒకేరీతిలో చూసే శివరామకృష్ణయ్య మన మధ్యలో లేకపోవటం నిజంగా దురదృష్టకరం. వారి అకాల మరణం మన పొనుగుపాడు గ్రామ ప్రజలకు తీరని లోటు.

2024 ఫిబ్రవరి 3 శనివారం ఉదయం పొనుగుపాడు లోని వారి స్వగృహం నందు పెద్దకర్మ జరుపబడతుంది. అదేరోజు తదుపరి శివరామకృష్ణయ్య గార్కి శ్రద్దాంజలి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసే సభజరుగుతుందని తెలియజేయడమైనది.

జోహార్ వంకాయలపాటి శివరామకృష్ణయ్య

 

 

Check Also

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు

2024 ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థులు భారత పార్లమెంటు లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *