
మన గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహిస్తున్న ఆటల పోటీలను కమిటీ సభ్యులు ముందుగా పాతూరి సీతారామాంజనేయులు మాస్టారు గారు మరణించిన సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించి ప్రారంభించారు.ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా మూడు రోజులు చిన్న ,పెద్ద తేడా లేకుండా గ్రామ ప్రజలంతా మన గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద జరిగిన కార్యక్రమాలన్నింటిలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు .
వీటీలో భాగంగా భోగి రోజు తెల్లవారుజామున అన్నీ బజార్లలో భోగి మంటలు వేసారు.అదే రోజు సంబరాలలో భాగంగా మద్యాహ్నం పంచాయితీ ఆఫీసు వద్ద ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి.లెమన్ స్పూన్ , రన్నింగ్ రేసు, స్కీపింగ్, మ్యూజికల్ చైర్, స్లో సైక్లింగ్ మరియు సీసాలు నింపుట వంటి పోటీలు బాల బాలికలకు నిర్వహించారు.భోగి రోజు ఆటల పోటీలు ఇలా ముగుసాయి , మరుసటి రోజు సంక్రాంతి సంబరంగా మహిళలకు ముగ్గుల పోటీ మరియు మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించడం జరిగింది .ముగ్గుల పోటీలో 22 మంది మహిళలు పాల్గొన్నారు . మ్యూజికల్ చైర్ పోటీలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వారి పాల్గొనడం కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.అలానే చిన్న పిల్లలకు చిత్రలేఖనం, డ్యాన్స్ , ఫ్యాషన్ షో పోటీలు నిర్వహించడం జరిగింది.చిన్న పిల్లలు ఎంతో ఉత్సాహంగా డాన్స్ పోటిలలో పాల్గొన్నారు .
ముగ్గుల పోటీలు మరియు చిన్నారుల చిత్రలేఖన (డ్రాయింగ్) పోటీలకు విచ్చేసిన న్యాయనిర్ణేతలు పోటీలను పరిశీలించి, ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. అనంతరం వారి చేతుల మీదుగా విజేతల పేర్లను ప్రకటించారు.
ఈ సందర్భంగా న్యాయనిర్ణేతలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసి, విచ్చేసిన న్యాయనిర్ణేతలను వలి మాస్టారు గారు ఘనంగా సన్మానించారు.
ఆ తరవాత రోజు కనుమ సందర్భంగా మధ్యానం 3 గంటలకు రైతులకి ట్రాక్టర్ రివర్స్ పోటీలు ప్రారంభమయ్యాయి , ఈ పోటీలో 10 మంది పాల్గొన్నారు. తర్వత వెంటనే మగవారికి బైక్ స్లో , తాడూ లాగుట పోటీలు కూడా నిర్వహించటం జరిగింది , ఐపోయిన వెంటనేయ్ మ్యాజిక్ షో అహ్ తరవాత హౌసే గేమ్ కూడా నిర్వహించి ఈ మూడు రోజులు జరిగినటువంటి ఆటల పోటీలో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది . ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు మరియు ఇతర ఖర్చులకు గ్రామ తెలుగుయువత ఖర్చు స్పాన్సర్ చేసారు. విజేతలకు వలి మాస్టర్ మరియు తెలుగుయువత సభ్యులు బహుమతులు ఇవ్వడం జరిగింది.
మన పొనుగుపాడు – తెలుగు భూమి సర్వేజనాః సుఖినోభవంతు – అందరూ బాగుండాలి